బోటు ప్రమాదంలో గల్లంతైంది వీరే..!

587
Boat Accident
- Advertisement -

గోదావరిలో పర్యాటక బోటు మునిగింది.  దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగినట్లు సమాచారం. 61 మంది పర్యటకులతో పాపికొండలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పర్యటకులు లైఫ్​ జాకెట్లు ధరించినట్లు సమాచారం. 14 మందిని తూటుగుంట గ్రామస్థులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు రాయల్​ వశిష్ట బోటు బయల్దేరింది.

Boat Accident

గోదావరి కొంత కాలంగా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బోట్లు తిరిగేందుకు అనుమతి లేదు. అయితే తాజాగా వరద ప్రవాహం తగ్గటంతో పర్యటకానికి అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఫోన్​లో మాట్లాడారు. రాజమహేంద్రవరం నుంచి సహాయ చర్యల కోసం హెలికాప్టర్​ రంగంలోకి దించారు.. నీటి ఉద్ధృతి, సహాయ చర్యలపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

బోటు ముంపు ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లాకాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారిలో యాదగిరి, ప్రభాకర్‌, సురేశ్‌, దశరథం, వెంకటసాయి (వరంగల్‌) ఎండీ మజ్గర్‌, రామారావు, అర్జున్‌, జానకి రామారావు, సురేశ్‌, కిరణ్ కుమార్‌, శివశంకర్‌, రాజేశ్‌ (హైదరాబాద్‌), లక్ష్మీ గోపాలపురం, మధులత(తిరుపతి), కె.గాంధీ (విజయనగరం) ఉన్నారు. గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బోటు ప్రమాదం లో హైదరాబాద్ వాళ్ళు 22మంది ఉన్నట్లు సమాచారం.

Godavari river

గల్లంతైన హైదరాబాద్ వాసులు:

1.సాయి కుమార్
2.రాజేష్
3.అబ్దుల్ సలీమ్
4.మహేష్ రెడ్డి

ఆచూకీ తెలిసిన వారి వివరాలు:

1) బసికె దశరథం s/o కొమురయ్య, 54 సం.
2) బసికె వెంకటస్వామి s/o రాజయ్య, 58 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
3) దర్శనాల సురేష్ s/o లింగయ్య, 24 సం.
4) గొర్రె ప్రభాకర్ s/o వెంకటస్వామి, 54 సం., రైల్వే ఉద్యోగి
5) ఆరేపల్లి యాదగిరి s/o కాజయ్య, 35 సం.

ఆచూకీ తెలియని వారి వివరాలు:

1) సివి వెంకటస్వామి s/o రామస్వామి, 62 సం, (రిటైర్డ్ రైల్వే ఉద్యోగి)
2) బసికె రాజేంద్రప్రసాద్ s/o వెంకటస్వామి, 50 సం.
3) కొండూరు రాజకుమార్ s/o గోవర్ధన్, 40 సం.
4) బసికె ధర్మరాజు s/o కొమురయ్య, 42 సం
5) గడ్డమీది సునీల్ , 40 సం.
6) కొమ్ముల రవి , 43 సం
7) బసికె రాజేందర్ ,58 సం.
8) బసికె అవినాష్,s/o తిరుపతి, 17సం
9) గొర్రె రాజేంద్రప్రసాద్ s/o రామస్వామి, 55 సం.

ప్రమాదానికి గురైన బోటు రాయల్ విశిష్ట డ్రైవర్లు సంగాడి నూకరాజు, తామరాజు లు కూడా మృతి చెందారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 18004253077కి కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.

- Advertisement -