ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేశామని తెలిపారు మంత్రి కేటీఆర్ . శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్…ఐటీని హైదరాబాద్ నలువైపులా విస్తరించామని తెలిపారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతో ఐటీ రంగంలో 17 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. కరీంనగర్‌లో నెలరొజుల్లో ఐటీ టవర్‌ని ప్రారంభించబోతున్నామని..మహబూబ్‌నగర్ ఐటీ టవర్‌కు టెండర్ పూర్తయిందని చెప్పారు. 50 ఎకరాల స్థల సేకరణ జరిగింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయని కేటీఆర్ తెలిపారు.
ఐటీఐఆర్ పాలసీ కింద యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదు. వారు ఇవ్వకపోయినంతా మాత్రాన ఐటీ అభివృద్ధి ఆగలేదన్నారు. ఉత్తర, దక్షిణ హైదరాబాద్‌లో కూడా ఐటీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాల సామర్థ్యం పెంచుతున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చెత్త సేకరణ, మురుగునీటి శుద్ధీకరణ మెరుగ్గా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ కోసం 21 ప్లాంట్లు పని చేస్తున్నాయని తెలిపారు.