హరిత తెలంగాణ కోసం తన వంతు మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. దేశవ్యాప్తంగా హరిత సంకల్పాన్ని చాటుతూ అపురూప మైలురాళ్లను అధిగమిస్తున్నది. గతేడాది రాజ్యసభ సభ్యలు జోగినపల్లి సంతోష్ కుమార్ నాటిన ఒక్క మొక్కతో మొదలైన గ్రీన్ చాలెంజ్. తాజాగా మూడు కోట్ల మైలురాయిని అధిగమించింది.
ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ హరితహారం అనే మహాయజ్ఞాన్ని చేపట్టారు. ఈ హరితహారానికి మద్దతుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కర్యక్రమం ఇంతింటై వటుడింతే అన్నట్టుగా .. హరిత ఉద్యమంగా రూపుదాల్చింది. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ మూడు కోట్ల మైలురాయిని అధిగమించి అపురుప ఘట్టంగా నిలిచింది.చెట్లు నాటే ఈ మహోన్నత కార్యక్రమంలో ఇదో విశిష్ట మైలురాయి. అందుకే దీనికి చిహ్నంగా ఎంపీ సంతోష్ కుమార్ మరోసారి మూడు కోట్ల ఒకటవ మొక్కను నాటారు. హైదరాబాద్ సంజీవయ్య పార్క్ సమీపంలోని డైరెక్టర్ ఆఫ్ ఈవి అండ్ డీఎం శిక్షణ మైదానంలో సంతోశ్ కుమార్ మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతురామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ అధికారులు, ఇగ్నైటింగ్ మైండ్స్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి , రాఘవ పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ కు వనమిత్ర బ్యాడ్జి ఆఫ్ హానర్ అవార్డును ఎంపీ సంతోష్ కుమార్ అందజేశారు.మొక్కను నాటి. మరో ముగ్గురిని సవాల్ చేయడమే గ్రీన్ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం. అందులో భాగంగానే గతేడాది ఓ మొక్కను నాటిన ఎంపీ సంతోష్ కుమార్.. మరో ముగ్గురిని ఛాలెంజ్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్ చేశారు. వారందరూ కూడా మొక్కలు నాటి తలా ముగ్గురిని ఛాలెంజ్ చేశారు. గతేడాది ఎంపీ సంతోశ్ కుమార్ చేతుల మీదుగా ఒక మొక్కతో ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభించింది.
రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గ్రీన్ చాలెంజ్ ఓ హరిత విప్లవంగా రూపుదాల్చింది. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి, సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో ముగ్గురిని నామినేట్ చేశారు. మధ్యలో గ్రీన్ ఛాలెంజ్ లక్ష్యం కోటికి చేరినప్పుడు.. దానికి చిహ్నంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ మొక్కను నాటారు. ఆ తర్వాత కూడా ఈ హరితసవాల్ మరింత జోరుగా కొనసాగింది. గ్రీన్ చాలెంజ్ రెండు కోట్ల మొక్కల మైలురాయిని చేరినప్పుడు ఆ ఘనతకు గుర్తుగా ఎంపీ సంతోష్ కుమార్ మరోసారి మొక్కను నాటారు. రెండు కోట్ల ఒకటవ మొక్కను నాటి గ్రీన్ చాలెంజ్ ను మరింత ఉధృతం చేశారు. తాను దత్తత తీసుకున్న కీసర అటవిలో .. అభయారణ్యం లో ఏకంగా 10 వేల మొక్కలు నాటారు. ఎంపీతో పాటు ఆయన అభిమానులు, ప్రజలు వేలాదిగా మొక్కలు నాటారు. అక్కడ అభయారణ్యాన్ని ఏర్పాటు చేసి.. మొత్తం లక్ష మొక్కలు పెంచుతున్నారు.
Green is the way of life. Immensely happy that my initiation, #GreenIndiaChallenge reached a staggering 3 Crore mark.Planted a sapling on tis occasion. I believe that when anything's started with a purpose, its gonna touch hearts n da response is evident. Happy green surroundings pic.twitter.com/Ibrya7Gx2g
— Santosh Kumar J (@MPsantoshtrs) September 13, 2019