మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 152వ చిత్రం సైరా. సురెందర్ రెడ్డి ఈమూవీకి దర్శకత్వం వహించగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసనిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈచిత్రంలో బిగ్ బి అమితాబ్ పలువురు నటీ నటులు ఈసినిమాలో నటించారు.
ఇక ఈమూవీని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కాగా త్వరలోనే ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పలు వేదికలను కూడా పరిశీలించారు. అయితే మొదట ఈవేదికను సైరా నరసింహారెడ్డి జన్మస్ధలమైన కర్నూలులో నిర్వహించాలని భావించారు.
అయితే ఈకార్యక్రమానికి చాలా మంది అతిధులు వస్తుండటంతో కర్నూలులో స్టే చేయడానికి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. అందుకోసమే ఈ ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లోనే నిర్వహిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారట. ఏ రోజున ఈ వేడుకను జరపనున్నారు? .. వేదిక ఎక్కడ? అనే విషయాలను రెండు రోజుల్లో తెలియపరచనున్నారు.