ఖైరతాబాద్ గణపతి… శోభాయాత్ర

384
Ganesh shoba yatra
- Advertisement -

ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. 11రోజులు పూజలందుకున్న గణపతి నేడు గంగమ్మ ఓడికి చేరుకోనున్నాడు. గతరాత్రి చివరి పూజలు అందుకున్న శ్రీద్వాదశాదిత్య మహాగణపతిని భారీ క్రేన్‌ సాయంతో ట్రక్కుపైకి ఎక్కించారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరిగే మొదటి నిమజ్జనం ఖైరతాబాద్ మహాగణపతిదేనని నిర్వాహకులు తెలిపారు.

ఉదయం 11గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లోని ఆరో నంబర్ క్రేన్ వద్దకు చేరుకుని ఒంటిగంట వరకు నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు తెలిపారు గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు. భారీ గణపతి నిమజ్జనం సాఫీగా సాగేందుకు నిమజ్జనం చేసే క్రేన్ వద్ద 20 అడుగులకు పైగా లోతును పెంచినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

ఇక శోభాయాత్రలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కేమెరాలతో నిఘా చేస్తున్నారు. గణేశ్ శోభాయాత్రలో పాల్గోనేందుకు చాలా మంది భక్తులు ఇప్పటికే ఖైరతాబాద్ కు చేరుకున్నారు.

- Advertisement -