కోర్టులో కోడిపుంజు గెలుపు ..!

735
kodipunju
- Advertisement -

ఫ్రాన్స్‌లోని ఒబెరాన్‌లో జియాన్ లూయీ బైరన్, జోలె అనే వృద్ధ జంట శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆశించింది. కానీ, వారి పొరుగింట్లో నివాసముంటున్న కోర్నీ ఫెస్సౌ అనే మహిళ పెంచుకుంటున్న మౌరైస్ అనే కోడిపుంజు వారి కలలను కల్లలు చేస్తోంది. పొద్దున్నే కొక్కొరోకో అంటూ అరిచి గీపెట్టడమే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు కూతలతో వారికి చుక్కలు చూపిస్తోంది. దాని కూతలు భరించలేక ఆ వృద్ధ జంట జులైలో స్థానిక సివిల్ కోర్టును ఆశ్రయించింది.

Maurice

ఈ కోడిపుంజు అరుపులతో తమకు నిద్రపట్టడం లేదనీ, కాబట్టి ఈ అరుపులను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. ఈ కూతలతో పర్యాటకులకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. అయితే ఈ పిటిషన్ ను విచారించిన ఫ్రెంచి కోర్టు.. వారి ఆరోపణలను తిరస్కరించింది. అంతేకాకుండా కోడిపుంజు యజమానిని కోర్టు వరకూ రప్పించి ఇబ్బంది పెట్టినందుకు రూ.78,677 చెల్లించాలని ఆదేశించింది.

అంతేకాదు ఈ కేసు విచారణ సందర్భంగా చాలా వింతలే చోటుచేసుకున్నాయి. మౌరీస్‌కు దేశం నలుమూలల నుంచీ సానుభూతిపరులు లభించారు.ఇక చాలామంది ప్రజలు కోర్టుకు తమ కోడిపుంజులను పట్టుకొచ్చి సంఘీభావం తెలియజేశారు.ఆ కోడిపుంజు కూత హక్కును కాపాడాలంటూ ఎలాక్ట్రానిక్ పిటిషన్ మీద 1.40 లక్షల మంది సంతకాలు చేశారు. కాగా, కోర్టు తీర్పుపై పుంజు యజమాని కోర్నీ ఫెస్సౌ హర్షం వ్యక్తం చేసింది.కోర్టు తీర్పు అనంతరం కోర్నీ మాట్లాడుతూ.. ”గ్రామీణ ప్రాంతం గ్రామీణంలాగానే ఉండాలి. ‘గ్రామీణ శబ్దాలను వినిపించకుండా చేయాల’ని చెప్పకూడదు” అని పేర్కొంది.

- Advertisement -