శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం: సీఎం కేసీఆర్

508
budget
- Advertisement -

ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని చెప్పారు సీఎం కేసీఆర్. రెండోసారి అధికారంలోకి వచ్చాక పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామీగా నిలిచిందన్నారు. తెలంగాణ వృద్ధిరేటు ప్రతి సంవత్సరం పెరుగుతోందన్నారు. స్వరాష్ట్రంగా తెలంగాణ ఆర్ధికంగా దృఢత్వంలో ఉందన్నారు.

సంక్షేమానికి ఏడాదిలో సగట 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అన్నిరంగాలకు నిరంతరాయంగా విద్యుత్‌ని అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి కాముక విధానాలతో సుస్థిరమైన వృద్ధిరేటు నమోదైందని చెప్పారు.

ప్రస్తుత రాష్ట్ర సంపద 8 లక్షల 66 వేల కోట్లుగా ఉందన్నారు.అవినీతి రహిత పాలన అందించడం వల్ల ఆర్ధిక ప్రగతి సాధ్యమైందన్నారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు. వేలాది చెరువులను పునరుద్దరించామని చెప్పారు.

ఆర్ధికమాంద్యం అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందన్నారు. ఇప్పటికే తయారైన వాహనాలు కొనేవారు లేకపోవడంతో ఆటోమొబైల్ రంగం దివాలా తీసే పరిస్థితి వచ్చిందన్నారు.

- Advertisement -