నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

358
cm kcr
- Advertisement -

తెలంగాణలో ఇవాల్టీ నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 11.00గంటలకు సభ ప్రారంభం కాగా 11.30కి ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక ఆర్దిక శాఖ మంత్రి హరీష్ రావు శాసన మండలిలో బడ్జెట్ ను ప్రేవేశ పెట్టనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు మంత్రి వర్గం ఆమోదం లభించింది. మొత్తం రూ.1.65 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో రూ.1.82 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అది ఆరు నెలల వరకే వర్తిస్తుంది. అందువల్ల సెప్టెంబర్‌ 30తో దాని కాల పరిమితి ముగుస్తుంది. అందుకే… ఇప్పుడు పూర్తిస్థాయి జనరల్ బడ్జె్ట్‌ను ప్రవేశపెడుతున్నారు. నిన్న రాష్ట్ర పూర్తి స్ధాయి మంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. మంత్రివర్గం లోకి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. హరీష్ రావు కు ఆర్ధిక శాఖ కేటాయించగా, కేటీఆర్ కు ఐటీ, మున్సిపల్ శాఖలను కేటాయించారు.

రెండు రోజుల క్రితమే అసెంబ్లీ, మండలిలో విప్, చీప్ విప్ లను కూడా నియమించింది సర్కార్. మరోవైపు మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. గుత్తా అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. అయితే, ఈ నెల 11న చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. ఇక, సభలో మెజార్టీ దృష్ట్యా.. చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి లాంఛనమే అంటున్నారు.

- Advertisement -