- Advertisement -
తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఛాలెంజ్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో ఆ తర్వాత సినీ హీరో అఖిల్ అక్కినేని,ఆ తర్వాత టీఆర్ఎస్ స్టేట్ యూత్ సెక్రటరీ శుభప్రద్,ఎంపీ కవిత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొక్కలు నాటారు.
అలాగే పలువురు సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు,రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి మరో ముగ్గురికి సవాల్ విసిరారు. తాజాగా ఈ ఛాలెంజ్‌లో భాగంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్‌లోని సికెఎం కాలేజీలో మొక్కలు నాటారు. అలాగే మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ ఆయన విసిరారు.
- Advertisement -