టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త చీఫ్ రాబోతున్నారన్న వార్తలు కొంతకాలంగా వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇక రేసులో సీనియర్లతో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీహెచ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
రేవంత్‌కు పీసీసీ పదవి అప్పజెబితే పార్టీకి నష్టమేనని…చాలామంది పార్టీని వీడే అవకాశం ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని నియమిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశౄరు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఇప్పటికే ఆయారాం.. గయరాం.. వంటి వ్యక్తులకు పార్టీలో కీలక పదవులు ఇస్తున్నారని ఆవేదన చేశారు.
ఓడిపోయినవాళ్లకు కూడా ఎంపీ టిక్కెట్లు ఇస్తున్నారని, నేతల బ్యాక్‌గ్రౌండ్ చూసి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే హస్తం శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.