జేఆర్సీ కన్వెన్షన్‌లో పహిల్వాన్‌ ప్రీ రిలీజ్‌..

561
pahilwan
- Advertisement -

శాండిల్‌వుడ్ బాద్‌ షా సుదీప్ హీరోగా తెరకెక్కిన చిత్రం పహిల్వాన్. సెప్టెంబర్ 12న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా రెజ్లర్ పాత్రలో కనిపించనున్నారు సుదీప్‌.

5 భాషల్లో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రాగా సుల్తాన్‌ సల్మాన్‌ను సైతం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఉపయోగించుకున్నారు. అంతేగాదు ఈ మూవీ ట్రైలర్‌పై ప్రశంసలు గుప్పించారు సల్మాన్‌.

తాజాగా పహిల్వాన్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించే ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్‌ 6న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌ జేఆర్సీ కన్వెన్షన్‌లో జరగనుంది.

సుదీప్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా కబీర్‌ దుహాన్‌సింగ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి, ఆకాంక్ష సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వారాహి బ్యానర్‌ నిర్మిస్తోంది.

- Advertisement -