టెలికం దిగ్గజం రిలయన్స్ నుండి మరికొద్ది రోజుల్లో జియో ఫైబర్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఫైబర్ గ్రిడ్ బంపర్ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కస్టమర్లకు చౌక ధరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఇతర కంపెనీలపై పడనుంది. ఈ నేపథ్యంలో జియోతో పోటీకి టెలికం సంస్థ ఎయిర్టెల్ సిద్ధమైంది. ఎయిర్టెల్ తాజాగా తన ఎయిర్టెల్ టీవీ ప్లాట్‌ఫాంను ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్గా రీబ్రాండ్ చేస్తూ ఎక్స్ట్రీమ్ బాక్స్, ఎక్స్ట్రీమ్ స్టిక్‌లను భారత్‌లో విడుదల చేసింది.
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ 4కె హైబ్రీడ్ బాక్స్గానూ పిలిచే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ ధర రూ.3,999. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులు కొత్త సెట్‌టాప్ బాక్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా రూ.2,249కే దీనిని పొందవచ్చు. దీంతోపాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ కంటెంట్‌పై ఏడాది సబ్స్క్రిప్షన్ (రూ.999) లభిస్తుంది.
అలాగే, హెచ్డీ డీటీహెచ్ ప్యాక్‌కు నెల రోజుల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లు, ఎయిర్టెల్ డాట్ ఇన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. సెట్‌టాప్ బాక్స్ ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్‌తో పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. వై-ఫై కనెక్టివిటీ కూడా ఉంది.
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ స్టిక్: ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ స్టిక్లోనూ ఎక్స్ట్రీమ్ బాక్స్‌లో ఉన్న చాలా ఫీచర్లు ఉన్నాయి. అయితే డీటీహెచ్ చానల్స్ యాక్సెస్ లభించదు. ముందుగానే లోడ్ చేసిన ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ సేవలు పొందవచ్చు. అలాగే, గూగుల్ ప్లే ద్వారా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్‌పై పనిచేస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ స్టిక్ ధర రూ.3,999 మాత్రమే. మొదటి నెల సబ్సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాతి నుంచి ఏడాదికి రూ.999 ప్లాన్‌ను రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ ఎనేబుల్డ్ సెట్ టాప్ బాక్సు ద్వారా యూజర్లు OTT స్మార్ట్ stick ద్వారా live Tv, వీడియో, మ్యూజిక్, న్యూస్, స్పోర్ట్స్ యాక్సస్ చేసుకోవచ్చు. కొత్త జనరేషన్ యూజర్ల కోసం ఎంటర్ టైన్ ప్లాట్ ఫాంలో ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ సర్వీసును ఇండియాలో తొలిసారి ఆఫర్ చేస్తున్నట్టు భారతీ ఎయిర్ టెల్ చీఫ్ ప్రొడక్టు ఆఫీసర్ ఆదర్శ్ నయిర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.