- Advertisement -
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్ తెరకెక్కిన మూవీ గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈచిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. విభిన్నమైన పాయింట్‌తో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో సాగుతుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే అనే పాటను విడుదల చేశారు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా…?రైటర్‌ను అయి ఉండి చెప్పడానికి నాకే మాటలు రావడం లేదు అంటూ నాని చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌ని మీరు చూసేయండి…
- Advertisement -