మాజీ మంత్రి ముత్యంరెడ్డి కన్నుమూత

666
harish-rao muthyam Reddy
- Advertisement -

మాజీ మంత్రి ,టీఆర్ఎస్ సీనియర్ నేత చెరుకు ముత్యం రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స సొందుతూ తుదిశ్వాస విడిచారు. ముత్యంరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముత్యంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ భగవంతుడిని ప్రార్థించారు. ముత్యంరెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్‌కే జోషిని సీఎం ఆదేశించారు. అలాగే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ముత్యంరెడ్డి మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. ముత్యంరెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు హరీశ్ రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. మంత్రిగా ఎమ్మెల్యేగా ముత్యం రెడ్డి ప్రజలకు చేసిన సేవలు గొప్పవన్నారు.

cm Kcr Cheruku Muthaym Reddy

మెదక్ జిల్లా దుబ్బాక నియోజవకర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్యంరెడ్డి స్వస్థలం సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్. తొగుట సర్పంచ్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. సహకార సంఘం ఛైర్మన్‌గా రెండేండ్ల పాటు సేవలందించారు. 1989లో దొమ్మాట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మరోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

- Advertisement -