- Advertisement -
రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వక సమావేశం ముగిసింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్ర గవర్నర్ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో తమిళసై సౌందరరాజన్ తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులయ్యారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇన్నాళ్లు సహాయ సహాకారులు అందించినందుకు నరసింహన్కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు గంట 40 నిమిషాల పాటు ఇరువురి భేటీ కొనసాగినట్లు సమాచారం.
- Advertisement -