గవర్నర్ నరసింహన్ బదిలీ? కొత్త గవర్నర్ గా..

381
esl narasimhan
- Advertisement -

తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారని తెలుస్తుంది. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నరసింహన్ స్థానంలో ఎవరిని నియమించాలన్నది కూడా సూత్రప్రాయంగా ఖరారు చేసినట్టు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడుకే చెందిన మరొకరిని తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తారని తెలుస్తున్నది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉన్నది.

తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్‌గా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా పనిచేసిన రికార్డు నరసింహన్‌కే దక్కింది. దీంతోపాటు రాష్ట్రంలో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్‌గా కూడా ఆయన గుర్తింపు పొందారు. నరసింహన్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో విడదీయరాని అనుబంధం ఉన్నది.

ఆయన హైదరాబాద్‌లోనే ఓనమాలు దిద్దటంతోపాటు ఐపీఎస్ అధికారిగా కూడా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లోనే పనిచేశారు. ఇక్కడ పోలీసు విభాగం గురించి ఆయనకు సమగ్ర అవగాహన ఉన్నది. ఇక రాజ్‌భవన్‌ను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే బదిలీకి సంబంధించి అధికారిక ప్రకటన చేయనుంది కేంద్ర ప్రభుత్వం. దాదాపు పదేళ్లగా గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్.. ఇటీవల జమ్ముకశ్మీర్‌కు గవర్నర్‌గా వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

- Advertisement -