జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 5 శాతానికి దిగజారింది. ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తయారీ రంగంలో క్షీణత, వ్యవసాయ ఉత్పతుల్లో స్తబ్ధత కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని కేంద్రం వెల్లడించింది.
జీడీపీ వృద్ధి రేటు భారీగా పడిపోవడం పట్ల స్పందించారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే పరిస్థతి కొనసాగితే ఆర్థిక మాంద్యం తప్పదని…మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపితే అద్భుతమే అన్నారు.
జీడీపీ 2019-20 మొదటి త్రైమాసికంలో 5 శాతానికి పడిపోవడం కచ్చితంగా దుష్ఫలితాలను చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలోనే ఇది అత్యంత వరెస్ట్ వృద్ధి రేటని తెలిపారు. తాను పెద్ద ఎకనామిస్ట్‌ను కాకపోవచ్చు కానీ, జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి పడిపోవడం కచ్చితంగా ఇబ్బందికర పరిణామమేనని కేటీఆర్ పేర్కొన్నారు.
Not much of an economist myself, but the news of GDP growth dropping to 5% in Q1, down from 5.8% (worst in 5 years) is most certainly troubling
Wonder if Union Govt has solutions/answers/ideas to make sure this doesn’t go on to become a full blown recession. Thoughts anyone?
— KTR (@KTRTRS) August 30, 2019