17 ఏళ్ళ అమ్మాయిగా మారనున్న కాజల్‌..

446
kajal agarwal
- Advertisement -

తెలుగు, త‌మిళ భాష‌ల‌లో అద‌ర‌గొట్టిన కాజ‌ల్ ఇప్పుడు బాలీవుడ్‌లోను త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు మరోసారి సిద్ద‌మైంది. గతంలో ఈ అమ్మడు బాలీవుడ్‌లో సినిమాలు చేసినా అవి సరైన విజయాన్ని అందించలేకపోయాయి. ఇప్పడు మరో అవకారం కాజల్‌ను వెత్తుకుంటు వచ్చింది. ప్రస్తుతం ‘ముంబై స‌గ’ అనే బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌నున్న‌ కాజ‌ల్‌.. జాన్ అబ్ర‌హంతో రొమాన్స్ చేయ‌నుంది. సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్. ప్ర‌తీక్ బాబ‌ర్, గుల్షన్ గ్రోవ‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని స‌మాచారం. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ముంబై స‌గ చిత్రంలో కాజ‌ల్ ఢిఫ‌రెంట్ రోల్స్ ప్లే చేస్తుంద‌ని అంటున్నారు. 17 ఏళ్ళ కాలేజ్ అమ్మాయిగా, యువ భార్యగా మరియు 30 ఏళ్ళ బలమైన మహిళగా కనిపిస్తుందట‌.

kajal-aggarwal

ఇటీవ‌లే ఈ మూవీ సెట్స్ లోకి కాజ‌ల్ అడుగుపెట్టిన‌ట్టు తెలుస్తుంది. ముంబయిలోని మహాలక్ష్మి ఆలయంలో ఈ సినిమా షూటింగ్‌ను లాంచనంగా ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్‌ను కూడా కొనసాగిస్తున్నారు. రెండు గ్రూప్‌ల మద్య గొడవ సీన్స్ ను మొదట చిత్రీకరించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు సంజయ్ గుప్త పలు ఆసక్తికర విషయాల రివీల్ చేశాడు. సినిమాలో కాజల్ పాత్ర రెండు విభిన్నమైన షేడ్స్ లో ఉంటుందని దర్శకుడు అన్నాడు.

17 ఏళ్ల వయసు అమ్మయిగా జాన్ గర్ల్ ఫ్రెండ్‌గా కాజల్ కనిపిస్తుంది. ఇద్దరి మద్య లవ్ సీన్స్ మరియు రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అదే విధంగా 30 ఏళ్ల వయసు స్త్రీగా జాన్ భార్యగా ఒక పవర్ ఫుల్ ఉమెన్‌గా కనిపించబోతుందని సంజయ్ చెప్పుకొచ్చాడు. సినిమాలోని రెండు విభిన్నమైన గెటప్స్ కోసం ఇప్పటికే మేకప్ టెస్టు చేశారని కాజల్ ఆ పాత్రకు చాలా బాగా సూట్ అవ్వడం వల్ల ఆమెను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 34 ఏళ్ల కాజల్ 17 ఏళ్ల అమ్మాయిగా ఎలా కనిపించనుందా అంటూ అప్పుడే ఆసక్తి స్టార్ట్ అయ్యింది.

- Advertisement -