వట్టెం అభివృద్ధి నా బాధ్యత – సీఎం కేసీఆర్

676
cm kcr
- Advertisement -

ఆరు నెలల్లో వట్టెం రిజర్వాయర్ పనులను పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గురువారం బిజినపల్లి మండలం వట్టెం రిజర్వాయర్ పనులను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, సంబంధిత ఏజెన్సీ ల ప్రతినిధులతో ప్రాజెక్టు పనులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పనులలో మరింత వేగం పెంచడానికి ప్రస్తుతం ఒక షిఫ్ట్ ద్వారా పనులను కొనసాగిస్తున్నందున 3 మూడు శిఫ్ట్లతో పనులు నిర్వహించాలని ఆరు నెలల్లోగా పూర్తి చేయడానికి ఏజెన్సీలు, అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన చెల్లింపులకు నిధులను విడుదల చేస్తామని, తెలిపారు. అదే విధంగా మిగిలి ఉన్న భూసేకరణ ఏమైనా ఉంటే కూడా దానిని పూర్తిచేయాలని సూచించారు.

అంతకముందు పాలమూరుకు చేరుకున్న సీఎంకు మర్రి జనార్దన్ రెడ్డి, బాలరాజు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి, షాలువా కప్పి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. భూములకు మంచి ధర కల్పించాలని రైతులు ముఖ్యమంత్రిని కోరారు. సీఎం , పూర్తి బాధ్యత తనదేనని ముంపు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకొని 12:30 కి తిరిగి బయల్దేరారు.

సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ , పి ఆర్ ఎల్ ఐ ఎస్ సిఇ రమేష్, బి జి ఆర్ సంస్థ ఎండి ఉమాపతి రెడ్డి, ఎన్ సి సి డైరెక్టర్ ఏబీఎన్ రాజు, పి ఆర్ ఎల్ ఐ ఎస్ ఈ ఈ ప్రభాకర్, తదితరులు ఉన్నారు.

- Advertisement -