మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డిస్కో రాజా సినిమా తెరకెక్కుతుంది. వీఐ ఆనంద్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేశ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ తళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ ఫస్ట్ లుక్ ను విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక రవితేజ తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈమూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. దర్శకుడు గోపిచంద్ మలిలేని రవితేజ కాంబినేషన్ లో గతంలో డాన్ శ్రీను సినిమా తెరకెక్కింది.