బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ ప్రెసిడెంట్ మహాదేవ్ జంకర్ కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పారు. ఈవిషయం సంజయ్ దత్ వరకు వెళ్లగా ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఈసందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. మహాదేవ్ జంకర్ చెప్పింది అబద్దమన్నారు . జంకర్ నాకు సోదరుడు, స్నేహితుడు లాంటివారు. భవిష్యత్తులో ఆయన రాజకీయ నాయకుడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
2009లో సంజయ్ సమాజ్వాది పార్టీ తరఫున లఖ్నవూ నుంచి పోటీ చేశారు. అక్రమ ఆయుధాలు కలిగిన కేసులో కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సంజయ్ అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సంజయ్ దత్ ప్రస్తుతం ప్రస్ధానం సినిమాలో నటిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈచిత్ర టీజర్ కు మంచి స్పందన వచ్చింది.