- Advertisement -
కాంగ్రెస్ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఐదురోజుల కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపర్చగా ఆయన కస్టడీని పొడగిస్తూ న్యాయస్ధానం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 30 వరకు నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీ పొడగించింది. దీంతో చిదంబరం తీవ్ర నిరాశ చెందారు.
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే సుప్రీంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా ఆయనకు నిరాశ ఎదురైంది. సీబీఐ అరెస్ట విషయంలో తలదూర్చలేమని తేల్చి చెప్పింది. దీంతో ఐదు రోజుల నుంచి సీబీఐ కస్టడీలోనే ఉన్నారు చిదంబరం.
మరోవైపు కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ సింఘ్వీ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
- Advertisement -