తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దుల్లో పెను గంగా నది అవతలి ఒడ్డున అనుమానస్పదంగా పులి మృతి చెందింది.మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పోడ్సాగ్రామ పత్తి చేను లో పులి మృతి చెంది ఉంది. పత్తి చేనులో పత్తి పంటలకు వేసే క్రిమిసంహారక మందు తిని పులి మృతి చెందగా ఆదివారం మహారాష్ట్ర, తెలంగాణ అటవీ అధికారులు సంయుక్తంగా పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నాలుగు రోజుల క్రితమే క్రిమిసంహారక మందు ప్రభావం వల్లనే మరణించి ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు. వేటగాళ్లు ఉచ్చు బిగించి ఉన్నట్లయితే పులి చర్మం పైన గాయాలు కనిపించేవని ఎలాంటి గాయాలు లేకపోవడంతో క్రిమిసంహారక మందు ప్రభావంతోనే మృతి చెందిందని విచారణ జరుపుతున్నారు.
ఆదివారం బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ అటవీ ప్రాంతంలో పులి దాడి చేయగా రెండు ఎద్దులు మరణించినట్లు అటవీ అధికారులు గుర్తించారు.అదే విధంగా పెంచికల్పేట అడవుల్లో పులుల సంచారాన్ని గుర్తించిన అటవీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.