తెలుగు తేజం బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో విజయం సాధించింది. స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సింధు విజయకేతనం ఎగురవేసింది. ఇవాళ జరిగిన ఫైనల్లో జపాన్ అమ్మాయి నజోమీ ఒకుహరపై వరుస గేముల్లో గెలిచింది.
కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో సింధు 21-7, 21-7తో ఘనవిజయం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా సింధు రికార్డు సృష్టించింది. టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్‌కి చేరిన భారత షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పిన సింధు మూడోసారి విజయం సాధించింది.
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే రెండు రజతాలు, రెండు కాంస్యాలు గెలుపొందిన పీవీ సింధు.. చివరిగా ఆడిన రెండు టోర్నీల్లోనూ కొద్దిలో పసిడి పతకాన్ని చేజార్చుకుంది. ముఖ్యంగా.. 2017 ఫైనల్లో ఒకుహరా చేతిలో ఓడిపోయింది. దీంతో.. ఈరోజు ప్రతీకారాన్ని తీర్చుకున్న సింధు.. కెరీర్‌లో ఒకుహరాపై ఉన్న గెలుపు రికార్డ్‌ని కూడా 9-7కి పెంచుకుంది.