బన్నీ కొత్త కారు.. పేరు ఎంటో తెలుసా?

393
Allu Arjun new Car
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల గ్యాప్ తర్వాత అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఒ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉండగా మరో వైపు కొత్త వాహనాలను కొంటున్నాడు. కొద్ది రోజుల క్రితమే బన్నీ రూ.8కోట్లతో కొత్త క్యారీ వ్యాన్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వాహనానికి ఫాల్కన్ అనే పేరు కూడా పెట్టాడు. ప్రత్యేకమైన డిజైన్ తో ఆ క్యారీ వ్యాన్ ను తయారు చేయించుకున్నాడు బన్నీ.

తాజాగా బన్నీ మరో కారును కొనుగోలు చేశారు. ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కారుతో ఫోటో దిగి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. మా ఇంట్లోకి కొత్త కారు వచ్చింది. దీనికి నేను బీస్ట్‌ అని పేరు పెట్టాను. నేను ఏదైన కొన్న ప్రతిసారి నాకు కృతజ్ఞత భావనే కలుగుతుంది’ అంటూ కామెంట్ పెట్టాడు బన్నీ.

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల.. వైకుంఠపురంలో సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తుంది. అల్లు అరవింద్, కె.రాథాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం 2020సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

- Advertisement -