గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమీక్షలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్ పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..వినాయక ఉత్సవాలపై ప్రజా పతినిధులతో గణేష్ ఉత్సవ సమితితో ,అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించం.హైదరాబాద్‌లో 54 వేల వినాయక ప్రతిమలకు పూజలు నిర్వహిస్తారు.ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ సిద్ధంగా ఉన్నారు.గణేష్ ఉత్సవాలను చూడటానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు కాబట్టిభారీ ఏర్పాట్లు చేస్తున్నాం.ప్రభుత్వం తరపున హుసేనసాగర్ గంగ హారతి ఇస్తామని తలసాని అన్నారు. ఎప్పుడు హారతి అనేదానిపై పురోహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
26 చోట్ల నిమార్జనం కోసం లేక్ లను ఏర్పటు చేస్తున్నాం.హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న చెరువులలో నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నాం.సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తాం.హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాలు అంటే చాలా గొప్పగా జరుగుతాయి.ఈ సోమవారం నాడు ఖైరతాబాద్ గణేష్ పనులను పరిశీలిస్తాము.గణేష్ ఉత్సవ సమితి చాలా బాగా ఏర్పాట్లు చేస్తోంది.నిమజ్జనం రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని వివరించారు.
మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ..గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని శాఖలతో వినాయక చవితిపై సమావేశం నిర్వహించాం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలను ఘనంగా జరుపుతుంది.హైదరాబాద్ అనేది సర్వ మతాలను గౌరవించే నగరం.ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నిమజ్జనం హైదరాబాద్‌లో జరుగుతోంది. దానికి సంబంధించిన అన్నింటిపై చర్చించాము.గతంలో ఎం చేశాం.. ఇప్పుడు ఎం చేద్దాం.. అనేదానిపై చర్చించాం.అధికారులు అందరూ అన్ని వివరాలు చెప్పారు,అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.ఇవ్వాళ సంతృప్తిగా సమావేశం జరిగింది.బందోబస్తు విషయంలో కూడా ఎలాంటి రాజీ పడేది లేదు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..ఇవ్వాళ వినాయక చవితి సంధర్భంగా రివ్యూ సమావేశం జరిగింది.
గణేష్ ఉత్సవాలు మన దగ్గర గొప్పగా జరుగుతుంది.హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాలు పెట్టి పూజించుకుంటున్నారు.గతంలో ముంబయిలో గొప్పగా పెద్దగా జరిగేవి కానీ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు గొప్పగా జరుగుతున్నాయి.అన్ని శాఖల సమన్వయంతో గొప్పగా నిర్వహిస్తాం.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని వసతులు కల్పిస్తాం.విజయవంతంగా పండుగ జరిగేలా ప్రజలు,భక్తులు సహకరించాలి.
హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. అన్ని శాఖలతో గణేష్ ఉత్సవాలపై సమావేశం జరిగింది.
హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు గొప్పగా జరుగుతున్నాయి.అన్ని పండుగలు చాలా గొప్పగా జరుపుతున్నారు మన సీఎం కేసీఆర్ అని హోం మంత్రి అన్నారు.