- Advertisement -
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో సిబిఐ అధికారులు చిందంబరంను అరెస్ట్ చేయడానికి అతని ఇంటికి చేరుకున్నారు. చిదంబరం కోసం అధికారులు వెతకగా..అతను అజ్నాతంలో ఉన్నట్లు తెలుస్తుంది. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే… చిదంబరాన్ని అదుపులోకి తీసుకుని విచారించాలని సీబీఐ, ఈడీ భావిస్తున్నాయి. చిదంబరం ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు అధికారులు. అయితే, చిదంబరం ఎక్కడికీ పరారవ్వలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ.
- Advertisement -