ఫోటో గ్రాఫర్ ల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడుతామన్నారు హోం మంత్రి మహమ్మద్ అలీ. సాలర్జింగ్ మ్యూజియం లో సిగ్మా అకాడమీ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో వరల్డ్ ఫోటో గ్రాఫి డే సందర్భంగా ” హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ ” జాతీయ స్థాయి ఫోటో గ్రాఫి వర్క్ షాప్ ను ప్రారంభించారు హోంమంత్రి .
ఈ కార్యక్రమంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈసందర్భంగా హోం మంత్రి అలీ మాట్లాడుతూ..
టి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైనామిక్ లీడర్ ఆయన ఐ టి మినిష్టర్ గా ఉన్నప్పుడు ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలకు హైదరాబాద్ వేదికైంది.
వాటికి సంబంధించిన చిత్రాలను మన ఫోటో గ్రాఫర్స్ అద్భుతంగా తీశారు. ఫోటో గ్రాఫర్ లను ప్రొత్సహించేందుకు ఆగస్ట్ 19న ఫోటో గ్రాఫర్ డే ను ఘనంగా నిర్వహించుకుంటున్నాం అన్నారు. ఫోటో గ్రాఫి అనేది ఒక మంచి ఆర్ట్ వచ్చే జనరేషన్ కు మంచి ఫోటో లను చూపించాల్సిన భాద్యత నేటి ఫోటో గ్రాఫర్ లకు ఉంది. సాలర్జింగ్ మ్యూజియంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు.