మెగాస్టార్‌ మూవీకి సూపర్‌స్టార్ సహకారం..!

312
Sye Raa Movie
- Advertisement -

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

pawan

అయితే తాజా చిత్రానికి దక్షిణాది సినీ ప్రముఖులు తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల అవుతుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో వాయిస్ ఓవర్‌ను పవన్ కల్యాణ్ అందించగా, తమిళంలో రజనీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యష్ లు వాయిస్ ఓవర్ అందించారని తెలుస్తోంది. ఇక హిందీలో ఈ పని ఎవరు చేశారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు.

రజనీకాంత్, మోహన్ లాల్ ప్రవేశంతో ‘సైరా’కు ఆయా భాషల్లో మంచి హైప్ లభిస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ స్టార్ సుధీర్‌, తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడ అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నారు.

- Advertisement -