- Advertisement -
బిగ్‌బాస్ హౌస్‌లో నటి మధు మిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ హౌస్‌లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ‘ఒరుకల్ ఒరు కన్నాడి’ చిత్రంలోని తన నటనతో నవ్వులు పూయించి పేరు తెచ్చుకున్న మధుమిత, సీజన్ 3లో పోటీదారుగా ఉంది.
కాగా ఇప్పటికే 50 రోజులకు పైగా హౌస్ లో ఉన్న ఆమె, కెప్టెన్ బాధ్యతలను నిర్వహిస్తూ, ఒత్తిడిని తట్టుకోలేక ఈ పని చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను హౌస్ నుంచి వెంటనే బయటకు పంపించేశారు. కమల్ పాల్గొన్న గత రెండు సీజన్లలో కూడా వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే హౌస్ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మధుమిత తెలిపింది.
- Advertisement -