హరా హై తో భరా హై(పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది.ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్ చేశారు. వారందరూ కూడా మొక్కలు నాటారు.
ఇలా ఏడాది పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రముఖులతో పాటు సామాన్యులూ భాగస్వామ్యం అయ్యారు. మొక్కలు నాటి, సెల్ఫీ దిగి పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో భారీగా కొనసాగింది. మధ్యలో లక్ష్యం ఒక కోటికి చేరినప్పుడు మొక్కను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాటారు.
ప్రస్తుతం ఈ లక్ష్యం నేటికి రెండు కోట్ల మొక్కలకు చేరటంతో మరో సారి ఎంపీ సంతోష్ మొక్క నాటారు. గత ఏడాది తాను నాటిన మొక్క ఏపుగా పెరగటంతో మరో సారి సెల్ఫీ దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ సారి కూడా మరి కొందరిని నామినేట్ చేయనున్నారు. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఇగ్నయిటెడ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ గ్రీన్ ఛాలెంజ్ ను చేపట్టింది. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ పాల్గొన్నారు.
#Happytoshare #selfie withmysaplings #greenindiachallenge of last year #Telanganakuharithaharam #HarahaiTohBharaHai
@2coresapling pic.twitter.com/71h97w9ypW— Santosh Kumar J (@MPsantoshtrs) August 18, 2019

