80 కోట్ల చేప పిల్లల పంపిణీకి ప్రణాళిక..

317
talasani
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మత్స ,పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఎన్నడు లేని విదంగా చేపల పంపిణీ చేసింది. మత్యకారులజీవితాల్లో వెలుగులు నింపడాని కోసం సీఎం కేసీఆర్‌ ఈ బృహత్తర మైన కార్యక్రమం చేపట్టారని ఆయన తెలిపారు.

80కోట్ల చేప పిల్లలను 5కోట్ల రొయ్య సిడులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది.చెరువులపై దళారీ వ్యవస్థ 90%అరికట్టడం జరిగింది.కుల వృత్తులపై ఆధారపడే జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం చర్యలుతీసుకుంటుంది.ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో 1లక్ష చేప పిల్లలను 16వేల రొయ్యల సీఢు వదిలమని మంత్రి తలసాని అన్నారు.

- Advertisement -