రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్..

465
cm kcr
- Advertisement -

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధిత ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ముఖ్య మంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రణాళిక సంఘం భాద్యత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్‌ కుమార్‌ను ఈ సంఘానికి ఉపాధ్యక్షుడిగా ముఖ్య మంత్రి నిర్ణయించారు.

B vinodkumar

 

2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తిస్తాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి ప్రతిపాదనలు తయారుచేసే కీలక పనిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించే వినోద్‌కుమార్‌కు సీఎం కేసీఆర్ అప్పగించారు.

వినోద్ నియామకంపై సీఎం స్పందిస్తూ.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కేబినెట్ హోదా కలిగి ఉండడంతో పాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారన్నారు. వినోద్‌కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో, పరిపాలనా అంశాల్లో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాలపట్ల అవగాహన కలిగిన వినోద్‌కుమార్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నియామకం చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

- Advertisement -