తమిళ నటుడు విమల్ ….హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాన్ని రాశి సినిమాలో వీరిద్దరూ కలిసి జంటగా నటించగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వరలక్ష్మిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొలిసారి ఓ మగాడికి జోడిగా నటించానని చెప్పి నాలుక కరుచుకున్నారు. అయితే వెంటనే తన వ్యాఖ్యలను సరిదిద్దుకోని ఆమెతో కలిసి పనిచేయడంలో ఎలాంటి ఇబ్బందులు గురికాలేదని తన ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. మూవీలో తన పాత్ర చాలా సహజంగా ఉంటుందని చెప్పారు.
వరలక్ష్మి మాట్లాడుతు తనకు జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పారు. సాధారణంగానే తనకు నూతన దర్శకులంటే ఇష్టం అని… సినిమా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే కడుపుబ్బ నవ్వానని చెప్పారు. ఇది ప్రేమ వివాహం నేపథ్యంలో సాగే చిత్రమని చెప్పారు. విమల్ మంచి నటుడని, ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు.
కింగ్ మూవీ మేకర్స్ పతాకంపై షమీమ్ ఇబ్రహీం నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.