బాలయ్యతో మూడోసారి..ఫుల్ హ్యాపీ:సోనాల్

633
sonal balakrishna
- Advertisement -

నందమూరి బాలకృష్ణతో లెజెండ్,డిక్టేటర్ సినిమాల్లో నటించి మెప్పించిన బ్యూటీ సోనాల్ చౌహాన్‌. లెజెండ్ సూపర్ హిట్ అయినా తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి బాలీవుడ్ బాటపట్టిన ఈ బ్యూటీ తాజాగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న మూవీతో టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతుండగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలయ్యతో సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపింది సోనాల్. బాలకృష్ణతో నటించడం ఇది మూడో సినిమా అని ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చని తెలిపింది. బాలకృష్ణ ఫ్యాన్స్‌ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలో యాక్షన్‌,రొమాన్స్‌తో పాటు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని తెలిపింది.

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తెలుగు సినిమాలకు కాసింత బ్రేక్ వచ్చిందని చెప్పుకొచ్చింది. బాలకృష్ణతో మూవీతో మళ్లీ తెలుగు సినిమా చేయడం ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పిన సోనాల్…త్వరలో మరిన్ని సినిమాలు చేస్తానని వెల్లడించింది.

హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా సోనాల్‌తో పాటు వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ కీ రోల్ పోషిస్తుండగా ఫుల్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియండెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్‌ చేస్తున్నారు.

- Advertisement -