- Advertisement -
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఒ మోస్తురు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమబెంగాల్ తీరాన్ని ఆనుకుని 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలు రెండు రోజులుగా తెరిపినిచ్చాయి. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సూర్యుడు దర్శనమిచ్చాడు.
- Advertisement -