వైసిపి కీలక నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తనకు కూతురు లాంటిదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రోజా ఈరోజు తనకు అన్నం పెట్టిందని..అన్నదాత సుఖీభవ అన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరద రాజు స్వామి దర్శనం అనంతరం ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లారు సీఎం కేసీఆర్. ఈసందర్భంగా రోజా నివాసంలో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.. రాయలసీమ ప్రాంతానికి తప్పకుండా గోదావరి జలలు రావాల్సినటువంటి అవసరం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీయాశీలకంగా పనిచేసేటువంటి, మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నరు కాబట్టి తప్పకుండా అది సాథ్యమవుతుందన్నారు. ఒక పెద్దన్నగా జగన్ కు నేను అండగా ఉంటానని చెప్పారు. రాయలసీమ ప్రాంత వాసుల బాధలు నాకు తెలుసు..తప్పకుండా వంద శాతం నా ఆశీస్సులు, సహాకారం ఉంటుందన్నారు. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి జగన్ , ఏపీ మంత్రులు చాల మందితో చర్చలు జరిపామన్నారు.
నీళ్లు ఈరోజు మనకు కళ్ల మందు కనపడుతన్నాయి. సుమారు 1000టీఎంసీలు గోదావరి నది నుంచి పోయాయన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రెండు ప్రాజెక్ట్ లు కూడా రెండు నిండు కుండలా మారాయన్నారు. గత 70సంవత్సరాల తెలుగు వాళ్ల చరిత్రలో కొత్త అధ్యాయం జగన్ నేను కలిసి లిఖించబోతున్నం..ఇందులో కొంత మందికి అర్ధం కాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతరు..వాళ్ళ గురించి మేము అసలు పట్టించుకోమని తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడం కోసం సర్వశక్తులు ఒడ్డి కష్డపడుతామన్నారు.