సీఐని రారా అని పిలిచిన ఎంపీ మాధవ్

764
Mp Gorantla Madhav Ci Muralidhar Reddy
- Advertisement -

సీఐ పదవికి రాజీనామా చేసి వైసిపిలో చేరి తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచారు గోరంట్ల మాధవ్. గడిచిన ఎన్నికల్లో వైసిపి నుంచి హిందూపూర్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎంపిగా గెలిచిన తర్వాత మాధవ్ తొలిసారి తన పార్లమెంట్ నియోజకవర్గంలోని కొడిమిలో పర్యటించేందుకు వెళ్లారు.

కొడిమిలోని వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. అక్కడే తనకు బందోబస్తుగా ఉన్న అనంతపురం రూరల్ సీఐ మురళిధర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. అతన్ని చూసిన ఎంపి ఒక్కసారిగా రేయ్ ఇటు రారా అని పిలిచారు.

దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. సీఐ మురళీధర్ రెడ్డి దగ్గరకు రాగానే గట్టిగా హత్తుకుని ఆప్యాయంగా పలకరించారు. నా ప్రణ స్నేహితుడు నాకే బందోబస్తు నిర్వహించడం ఏంటి..? నా పక్కన కూర్చో అంటూ చెప్పుకొచ్చారు. సభ అయ్యేవరకు సీఐ మురళీధర్ రెడ్డి గోరంట్ల మాధవ్ వెంటే ఉన్నారు. విధినిర్వహణకు ప్రాధాన్యతను ఇస్తూ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించే మురళీ లాంటి అధికారి మన జిల్లాకు లభించడం అదృష్టమని చెప్పారు.

- Advertisement -