అత్తివరదరాజు స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

391
cmkcrkanchipuram
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులోని కాంచీపురంలో పర్యటిస్తన్న సంగతి తెలిసిందే. కంచిలో గల అత్తి వరద రాజు స్వామి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

అంతకుముందు కేసీఆర్ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న సీఎంకు నగరి ఎమ్మెల్యే రోజా ఘనస్వాగతం పలికారు. కొద్ది సేపటి తర్వాత సీఎం కేసీఆర్ రోజా ఇంటికి వెళ్లి భోజనం చేయనున్నారు.

- Advertisement -