రూ.500, 1000 నోట్లు రద్దుతో తలెత్తిన సమస్యలు ఇంకా కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ రద్దు గడువును మరోమారు పొడిగించింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 2 వరకు ట్యాక్స్ రద్దును పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. నల్లధనాన్ని, నకిలీనోట్లను అరికట్టడానికి ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో టోల్గేట్ల వద్ద వాహనదారులు తీవ్ర అవస్థలు పడిన సంగతి తెలిసిందే.
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వాహన దారుల వద్ద కావాల్సినంత చిల్లర అందుబాటులో లేకపోవడంతో,,కీలోమీటర్ల మేర ట్రాపిక్ జామ్ ఏర్పడ్డింది. చిల్లర విషయంలో టోల్ టాక్స్ వద్ద.. టాక్స్ సిబ్బందికి, వాహనదారులకు గొడవలు కూడా జరిగాయి.
చిల్లర కొరత వల్ల వాహనదారుల తీవ్ర ఇక్కట్లు..ట్రాఫిక్ జామ్ ను సమస్యలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం..మూడు రోజుల పాటు టోల్ గేట్ రుసుం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో..మరో రెండు సార్లు పొడిచింది. అప్పటికి సమస్య తగ్గుముఖం పట్టకపోవడంతో..ఈనెల 24 వరకు గడువును పోడిగించింది.
ప్రభుత్వం కొత్త నోట్ల పంపిణీ విషయంలో జాప్యం కావడం..బ్యాంకుల్లో..ఏటీఏంలలో డబ్బులు లేకపోవడంతో..ఇప్పటికీ పరిస్థితి చక్కపడలేదు. ఈ నేపథ్యంలో వాహన దారుల ఇబ్బందుల దృష్ట్య కేంద్రం తాజాగా మారోమారు ప్రకటన చేసింది. టోల్ టాక్స్ రద్దు తేదీని 24 నుంచి డిసెంబర్ 2 కి పొడిగిస్తూ..నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో చిల్లర కొరతతో సతమతమవుతున్న వాహనదారులకు మరోసారి ఉపశమనం కలిగించినట్టైంది.