66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు.
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం- ‘మహానటి’
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ -‘మహానటి’
ఉత్తమ ఆడియోగ్రఫీ – రాజాకృష్ణన్ (రంగస్థలం)
బెస్ట్ యాక్షన్ చిత్రం- ‘కేజీఎఫ్’
బెస్ట్ డైరెక్టర్ – ఆదిత్య దార్ (ఉరి)
బెస్ట్ యాక్టర్ – ఆయుష్మాన్ ఖురానా (అంధాదూన్)
ఉత్తమ నటి – కీర్తి సురేష్ (మహానటి)
జాతీయ ఉత్తమ చిత్రం ‘అంధాదూన్’
జాతీయ ఉత్తమ మరాఠీ చిత్రం ‘భోంగా’
జాతీయ ఉత్తమ తమిళ చిత్రం- ‘బారమ్’
ఉత్తమ ఉర్దూ చిత్రం -‘హమీద్’
ఉత్తమ సంగీత దర్శకుడు – సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం – పద్మావత్
ఉత్తమ రాజస్థానీ చిత్రం – టర్టుల్
ఉత్తమ పంజాబీ చిత్రం – అర్జేదా
ఉత్తమ అస్సామీ చిత్రం – బుల్ బుల్ కెన్ సింగ్
ఉత్తమ సహాయ నటుడు – ఆనంద్ కిర్కిరే (చుంభక్)
ఉత్తమ సహాయనటి – సురేఖ సిక్రీ (బాదాయి హో)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – అ! (తెలుగు)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ – కమ్మర సంభవం (మలయాళం)
బెస్ట్ సౌండ్ డిజైనర్ – ఉరి (హిందీ)
బెస్ట్ ఎడిటింగ్ – నాతిచరామి (కన్నడ)
బెస్ట్ డైలాగ్ – తారిఖ్ (బెంగాలీ)
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ – బిందుమాలిని (నాతిచరామి.. మాయావి మానవే సాంగ్)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ – అర్జిత్ సింగ్ (పద్మావత్.. బింతే దిల్ సాంగ్)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – పీవీ రోహిత్, సాహిబ్ సింగ్, తల్హ అర్షద్ రేషి, శ్రీనివాస్ పోకలే
బెస్ట్ కోరియోగ్రఫీ – పద్మావత్ (గూమర్ సాంగ్)