మోహన్‌లాల్ ‘మన్యం పులి’…యు/ఎ

232
‘Manyampuli’ clears censor, gets U certificate
- Advertisement -

మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ మన్యంపులి విడుదలకి సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ‘యు’ రేటింగ్ తో ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా మళయాలీ వెర్షన్ ‘పులిమురుగన్’ భారీ స్థాయిలో విడుదలై దాదాపు 125 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూళు చేసింది. అదే రేంజ్ లో తెలుగునాట కూడా ఈ సినిమా భారీ సక్సెస్ అవుతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది, కేవలం 24 గంటల్లో 5 లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయని చిత్ర బృందం తెలిపింది.

‘Manyampuli’ clears censor, gets U certificate

త్వరలోనే చిత్ర థియేట్రికల్ ట్రైలర్ తో పాటు ప్రి రిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు మన్యం పులి యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా మన్యం పులి కోసం ఎదురుచూస్తున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, బ్యానర్ : సరస్వతి ఫిల్మ్స్

‘Manyampuli’ clears censor, gets U certificate

‘Manyampuli’ clears censor, gets U certificate

- Advertisement -