ఆ ఇద్దరితో బ్యాంకాక్ కు బాలకృష్ణ

373
balakrishna
- Advertisement -

హీరో బాలకృష్ణ తన తర్వాతి మూవీ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా పూర్తైయ్యాయి. ఈసినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ను ఈనెల 9నుంచి ప్రారంభిస్తారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

సినిమాలో బాలయ్య డ్యుయల్‌ రోల్లో యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం . ఈ సినిమాలో బాలకృష్ణ..పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనేదే ఈమూవీ అసలు కథ. ఈ సినిమాకి ‘క్రాంతి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం.

బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినీయర్ హీరోయిన్ నమిత ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈమూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -