100 కోట్లతో అమరవీరుల స్థూపం-ప్రశాంత్ రెడ్డి

537
V-Prashanth-Reddy-750x400
- Advertisement -

నేడు ప్రో.జయశంకర్ 82 వ జయంతి సందర్భంగా లుంబిని పార్క్ సమీపంలో అమరవీరుల జ్ఞాపకార్థం అమరవీరుల స్మారక స్థూపం పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రో.జయశంకర్ 82 వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటు అమరవీరుల స్మారకార్థం స్తూపం పనులను పర్యవేక్షించడం జరిగింది. తెలంగాణ పోరాట యోధులు, విద్యార్థులు, ఉద్యమకారులు 15 సంవత్సరాల పోరాట ఫలితంగా తెలంగాణ సాదించుకున్నామని మంత్రి అన్నారు.

Minister Vemula Prashanth reddy

తెలంగాణ ఉద్యమం సమయంలో 369 మంది విద్యార్థి యువకులను బలిదానాలు తీసుకుంది ఆనాటి ప్రభుత్వాలు.. వారి జ్ఞాపకార్థం కోసమే ఈ స్తూపం ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నడిబొడ్డు లుంబిని పార్క్ సమీపంలో 3 ఎకరాల 20 గుంటల స్థలంలో 100 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ స్థూపాన్ని నిర్మించడం జరుగుతుంది.

పార్కింగ్‌తో పాటు మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడియో రూమ్ తదితర సౌకర్యాలతో అత్యంత నాణ్యతో ఈ స్తూపంను నిర్మించబోతున్నాం.ఇతర రాష్ట్రాలు కాకుండా ఇతర దేశాల నుండి వచ్చే సందర్శకులు కూడా తెలంగాణ ఉద్యమం గురించే తెలుసుకునేల స్తూపంను నిర్మించబోతున్నామని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -