త్రివిక్రమ్‌ – ఎన్టీఆర్ కాంబో మరోసారి..!

531
trivikram ntr
- Advertisement -

అరవింద సమేత..వీర రాఘవ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం ఆర్‌ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు రాంచరణ్‌. ఇక ఈ మూవీ తర్వాత మరోసారి త్రివిక్రమ్‌తో చేయనున్నాడు యంగ్ టైగర్‌.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన అరవింద సమేత ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రాయలసీమ స్లాంగ్‌లో ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ నేపథ్యంలోనే తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్‌తో మరోసారి సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఇటీవల త్రివిక్రమ్ వినిపించిన స్టోరీ లైన్ కు ఎన్టీఆర్ ఇంప్రెస్ అయ్యాడట. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్‌తో మూవీని పట్టాలెక్కించనున్నాడు త్రివిక్రమ్.

- Advertisement -