ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పె వరద ఉదృతి పెరుగుతోంది.ఇన్ ఫ్లో— 2,62,084 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో— నిల్.పూర్తి స్థాయి నీటిమట్టం -: 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం -: 863.80 అడుగులు కు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ -: 215 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ- : 118.0544 టిఎంసిలు.
మరోవైపు గోదావరిలో వరద ఉధృతి తగ్గడం లేదు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలకు వరద తోడు కావడంతో గత నాలుగు రోజులుగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.
తుపాకులగూడెం బరాజ్ వద్ద గోదావరి సోమవారం సాయంత్రం 8.64 మీటర్లతో ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవాహం కొనసాగుతోంది. ముల్లకట్ట పుష్కరఘాట్ వద్ద కూడా గోదావరి ఉధృతంగానే ఉంది. వరద ఉధృతి కారణంగా ప్రజలు గోదావరిలోకి వెళ్ళొద్దని సూచిస్తున్నారు అధికారులు.