అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తమ బెస్ట్ ఫ్రెండ్ ల ఫోటోలు షేర్ చేస్తున్నారు పలువురు సెలబ్రెటీలు. ఈసందర్భంగా తమ స్నేహితులకు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా తన బెస్ట్ ఫ్రెండ్ గురించి ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.
విధి అనుకూలంగా ఉన్న సమయంలో జీవితంలో సాయి వంటి వ్యక్తి పరిచయం అవుతాడని, అతడిది చిన్నపిల్లవాడి మనస్తత్వం అని పేర్కొన్నారు. నమ్మకానికి, కొండంత అండకు ప్రతిరూపం అంటే సాయి పేరే చెప్పుకోవాలని కొనియాడారు. అంతేకాకుండా, ‘ఇతడే నా భీమ్’… తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ పెట్టారు.
ఈగ సినిమా నుంచి రాజమౌళి, సాయి కొర్రపాటి మంచి మిత్రులయ్యారు. రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలీం సిటిలో జరగుతుంది. 2020జూన్ 20న ఈసినిమాను విడుదల చేయనున్నారు.
If destiny favours you, you will meet a human like Sai garu in life. Someone who's a child at heart, symbol of trust and a huge support. He's my Bheem and I wish him nothing but happiness..:)#RRRYehDosti pic.twitter.com/vBJ61JUd6X
— rajamouli ss (@ssrajamouli) August 4, 2019