మనం చిత్రంలో అతిధి పాత్రలో మెరిసి.. ఊహలు గుసగుసలాడే చిత్రంతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ముంబై ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంలో తన నటనతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అందాలను రాశి పోసి పేర్చినట్లుండే రాశి ఖన్నా టాలీవుడ్ కే అంకితం అయిపోయింది. వరుసగా ఇక్కడే సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ ని ఏలేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.
హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా జెట్ స్పీడుతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెంకిమామ సినిమాలో చైతూ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ వైపు సినిమాలు సినిమాలు చేస్తూనే తన హెల్త్‌పై మరింత దృష్టిసారించింది.
ఇందులో భాగంగా గ్లామర్ డోస్‌ని మరింతగా పెంచేసింది రాశిఖన్నా. అప్పుడెప్పుడో బెంగాల్ టైగర్ సినిమాలో బికినీతో మెరుపులు మెరిపించిన ఈ అమ్మడు.. చాలాకాలం తరువాత మరలా బికినీతో రెచ్చిపోయింది.
ఇండియన్ హెల్త్ కేర్ అనే హెల్త్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. లైట్ కలర్ బికినీలో రాశిఖన్నా అదరహో అనిపించింది. మార్పు కావాలని కోరుకోవడం సహజం. మార్పు చెందటం అంటే తమను తమను బలంగా మార్చుకోవడమే అనే అర్ధంతో మెసేజ్ ఇచ్చింది రాశి ఖన్నా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాశీ బికినీ అందాలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.