పూల్వామాలో ఉగ్రదాడి దాడి…man vs wild షూటింగ్‌లో మోడీ..!

633
modi discovery pulwama attack
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏం చేసినా సంచలనమే. బీజేపీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన దగ్గరి నుంచి నోట్ల రద్దు,జీఎస్టీ ఇలా సంచలన నిర్ణయాలు ఎన్నో. తాజాగా డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే man vs wild(మేన్ వర్సెస్ వైల్డ్) ప్రోగ్రాం గురించి అందరికి తెలిసిందే. విపత్కర పరిస్థితుల్లో వరదలు,ఎడారిలో,సముద్రంలో చిక్కుకున్నప్పుడు,తినడానికి తిండి దొరకని దట్టమైన అడవుల్లో ఎలా జీవనం సాగించి బయటపడచ్చో చూపించే రియల్ అడ్వెంచర్‌ ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత.

ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ప్రపంచ సాహస వీరుడు బియర్ గ్రిల్స్‌తో కలిసి ప్రయాణం చేశారు మోడీ. ఈ షో ఆగస్టు 12న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రొమోను విడుదల చేసింది డిస్కవరీ ఛానల్‌.

ప్రస్తుతం ఈ ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా అదేసమయంలో నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. పిబ్రవరి 14,2019 పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాల ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై సూసైడ్ బాంబర్ దాడి చేశారు. ఈ దాడిలో 48 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. దీని తర్వాత పాకిస్ధాన్‌లోని బాలాకోట్‌లోని తీవ్రవాద స్ధావరాలపై దాడులు ఒకదశలో పాక్‌-భారత్‌ మధ్య యుద్ధం వస్తుందా అనే పరిస్ధితులు నెలకొన్నాయి.

అయితే ఈ దాడుల కంటే ముందు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. ఈ సారి మోడీ గెలవడం కష్టం, గెలిచినా ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలోకి రావొచ్చనే ప్రచారం జరిగింది. కానీ పుల్వామా దాడి జరిగిన తర్వాత నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ సఫలమైంది.

పాక్‌పై దాడి చేయాలంటే మోడీనే సమర్థుడనే ప్రచారం జరిగింది. పాక్ అంతుచూడాలని అందరూ కొరుకున్నారు. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే పుల్వామా దాడి జరిగిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్కడున్నారనే దానిపై అప్పట్లో ప్రతిపక్షాలు ప్రశ్నలు గుప్పించాయి. ఉగ్రదాడి 3 గంటలకు జరిగితే రాత్రి 7 గంటలకు ప్రధాని జిమ్ కార్పెట్ పార్క్‌ నుంచి బయటకు వచ్చారు. 3.10 నుంచి 7 వరకు మోడీ అక్కడ ఏం చేశారు…? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే యాంటీ నేషనల్స్‌ అనే ముద్ర వేస్తూ ప్రచారం చేశాయి బీజేపీ శ్రేణులు.

కానీ ప్రస్తుతం డిస్కవరీ ఛానల్ విడుదల చేసిన ప్రొమో చూస్తే మోడీ దేశ భక్తిని ప్రశ్నించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉగ్రదాడి జరిగిన వెంటనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్పందించారు. ఇంత కీలక సమాచారాన్ని ప్రధానికి చేరవేశారు. కానీ మోడీ మాత్రం డిస్కవరీ ఛానల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

దీంతో ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఆరోజు దేశమంతా అట్టుడుకుతుంటే మోడీ మాత్రం వన్యమృగాల మధ్య,ప్రకృతి ఒడిలో డిస్కవరీ షూటింగ్‌లో పాల్గొనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే దేశ ప్రధానిగా నేషనల్ సెక్యూరిటీతో రివ్యూ చేయాలి, భద్రత బలగాలతో చర్చించాలి,దాడి జరిగిన తర్వాత నాలుగు గంటలు, తనకు తెలిసిన తర్వాత మూడు గంటలుప్రధాని భద్రత చర్యల గురించి ఆలోచించ కుండా ఎలా ఉండగలిగారని విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -