మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం

726
Mukesh Goud
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కేన్సర్‌ వ్యాధి బారిన పడిన ఆయన కొంతకాలంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలిసిన ముకేశ్ గౌడ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి తరలి వస్తున్నారు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాస్పిటల్‌కు వెళ్లి ముఖేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం ముఖేష్‌గౌడ్‌కు ఐసీయూలో చికిత్స జరుగుతోందని ఆయన కుమారుడు విక్రమ్ తెలిపారు.

- Advertisement -